వెక్టర్ వ్యాధులపై అక్టోబర్ 16 నుండి జాతీయ సర్వే

- October 12, 2022 , by Maagulf
వెక్టర్ వ్యాధులపై అక్టోబర్ 16 నుండి జాతీయ సర్వే

మస్కట్: వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల కోసం సమగ్ర జాతీయ సర్వే అక్టోబర్ 16 నుండి వివిధ గవర్నరేట్‌లలో ప్రారంభమవుతుందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాధులతో సంబంధం ఉన్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి వ్యాధి వాహకాలు, వాటి సంతానోత్పత్తి ప్రదేశాలపై ఈ సర్వేలో భాగంగా దృష్టి సారించనున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడు నెలల సర్వేలో అన్ని గవర్నరేట్‌లు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే, కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతాలను కవర్ చేస్తుందని పేర్కొంది.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఖాతాల ద్వారా..గవర్నర్ కార్యాలయాల ద్వారా ఒక ప్రాంతంలో సర్వే తేదీ నివాసితులకు ముందుగానే తెలియజేయబడుతుందని తెలిపింది. జాతీయ ప్రాజెక్టును నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, బృందాల పనిని సులభతరం చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మలేరియా, డెంగ్యూ జ్వరం, ఎల్లో ఫీవర్ వంటి వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు.. అన్ని అంటువ్యాధులలో 17 శాతానికి పైగా ఉన్నాయి.  వీటివల్ల ఏటా 700,000 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇవి పరాన్నజీవులు, బ్యాక్టీరియా లేదా వైరస్‌ల వల్ల వేగంగా సంక్రమిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com