మారుతితో ప్రబాస్: సైలెంట్‌గా కానిచ్చేస్తాడా.?
- October 13, 2022
మారుతి డైరెక్షన్లో ప్రబాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడయితే, ఈ న్యూస్ బయటికి వచ్చిందో, ప్రబాస్ ఫ్యాన్స్ గుస్సా అయిపోయారు. వద్దు బాబోయ్ వద్దు, మారుతితో సినిమానే వద్దు.. అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ కూడా మొదలెట్టారు.
కానీ, ఫ్యాన్స్ మాటను పెడ చెవిన పెట్టేశాడట ప్రబాస్. ఈ ప్రాజెక్ట్‌ని త్వరలోనే పట్టాలెక్కించేయనున్నాడట. అంతేకాదు, సింపుల్‌గా, లో బడ్జెట్‌తో కామ్‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది డార్లింగ్ ప్రబాస్.
ఈ మధ్య ప్రబాస్ నుంచి వచ్చిన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్. రాబోయే ‘ఆది పురుష్’ సినిమా మీద కూడా రకరకాల విమర్శలూ, కాంట్రవర్సీలు.. దాని భవిష్యత్ ఎలా వుండబోతోందనే విషయంలో సర్వత్రా అనుమానాలున్నాయ్.
ఈ నేపథ్యంలో మారుతిలాంటి చిన్న డైరెక్టర్‌తో ఓ చిన్నపాటి కూల్ ఎంటర్టైన్మెంట్ని కానిచ్చేసి, ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడట ప్రబాస్. అదే పనిలో తెర వెనక బిజీగా వున్నాడట. ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు మాళవిక మోహనన్ కాగా, మరో ఇద్దరు భామల పేర్లు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు