101 కొత్త చారిత్రక ప్రదేశాలను గుర్తించిన సౌదీ హెరిటేజ్ కమిషన్
- October 13, 2022
రియాద్: 101 కొత్త పురావస్తు, చారిత్రక ప్రదేశాలను గుర్తించి జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్లో నమోదు చేసినట్లు కింగ్డమ్ హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది. దీంతో రాజ్యవ్యాప్తంగా నమోదిత పురావస్తు ప్రదేశాల సంఖ్య 8,528కి చేరుకుందని తెలిపింది. కొత్తగా కనుగొన్న వాటిల్లో హేల్లో 81, తబుక్‌లో తొమ్మిది, మదీనాలో ఆరు, ఖాసిమ్‌లో మూడు, అసిర్ మరియు జౌఫ్‌లో ఒక్కో సైట్ ఉన్నాయని పేర్కొంది. జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్లో రాజ్యంలోని పురావస్తు, చారిత్రక ప్రదేశాలను కనుగొని, అధికారికంగా నమోదు చేసేందుకు కమిషన్ కృషి చేస్తోంది. చారిత్రక ప్రదేశాల పరిపాలన, రక్షణ, సంరక్షణను సులభతరం చేసేందుకు వీలుగా ఆయా ప్రాంతాలను డిజిటల్ మ్యాప్‌లలో పొందుపరుచుతుంది. ఇందు కోసం ఆర్కైవ్ పత్రాలు, ఫోటోలతో ప్రత్యేక డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నారు. సౌదీ చారిత్రక వారసత్వాన్ని సంరక్షించడంలో పౌరులు కీలక భాగస్వాములుగా చేరాలని, బాలాగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమకు తెలిసిన/కనుగొన్న పురావస్తు ప్రదేశాలను తెలియజేయాలని సౌదీ హెరిటేజ్ కమిషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్