స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఎమిరేట్స్ ఐడీ దరఖాస్తు సమర్పణ
- October 14, 2022
యూఏఈ: కొత్త ఎమిరేట్స్ ID కోసం దరఖాస్తు చేసేవారు లేదా ఉన్న కార్డులను పునరుద్ధరించాలనుకునే నివాసితులు ఇకపై తమ ఇంటినుంచే ఆ పనిని పూర్తి చేయవచ్చు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) దుబాయ్‌లో కొనసాగుతున్న జిటెక్స్ గ్లోబల్‌లో ప్రకటించింది. ఎమిరేట్స్ ID అప్లికేషన్లను ఇబ్బంది లేకుండా ఇంటినుంచే దరఖాస్తు చేసేందుకు వీలుగా కొత్త స్మార్ట్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఐసీపీ వెల్లడించింది. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నంబర్ లేదా నివాసి పాస్‌పోర్ట్ పేజీ యొ ఫోటో ద్వారా యాప్ ను ఓపెన్ చేయవచ్చు. అనంతరం ఫోన్ కెమెరాతో ముఖ లక్షణాలతో పాటు చేతివేళ్లను స్కాన్ చేసి దరఖాస్తు సమర్పించవచ్చు. దీంతో ఎమిరేట్ ఐడీలు కేవలం కొన్ని సెకన్లలో ప్రాసెస్ చేయబడతాయని ఐసీపీ ప్రతినిధి తెలిపారు. కొత్త తరం ఎమిరేట్స్ IDలు గత ఏడాది ఆగస్టులో ప్రారంభించబడ్డాయని, కొత్త కార్డ్‌లు మరింత మెరుగైన రక్షణను అందించడంతోపాటు ఇ-లింక్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయన్నారు. డిజిటల్ సర్టిఫికేషన్ పోర్టల్ అప్‌గ్రేడ్ వెర్షన్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అందుబాటులో ఉందన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!
- సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- రియాద్ లో బ్రిడ్జి పై నుండి కిందపడ్డ పోలీస్ వాహనం..!!
- బ్లాక్ 338లో పార్కింగ్ స్థలాలను తొలగింపు..!!
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు