అసభ్యకర రీతిలో మాజీ భార్య వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్...మూడు నెలల శిక్ష
- October 14, 2022
దుబాయ్: మాజీ భార్య వీడియోలను అసభ్యకరరీతిలో సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తికి దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత అతన్ని నగర బహిష్కరణ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే గత ఏడాది అక్టోబరులో ఓ మహిళకు తన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే 10 వేల డాలర్లు ఇవ్వాలంటూ మెసేజ్ వచ్చింది. బాధితురాలు అసభ్యకరంగా ఉన్న ఓ క్లిప్ కూడా ఆమె మొబైల్ కు వచ్చింది. దీంతో ఆ మహిళ పోలీసులను సంప్రదించింది. తన మాజీ భర్త పై అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా నేరం తానే చేశానని ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతనికి మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు