‘కాంతార’ మరో ‘కేజీఎఫ్’ అవుతుందా.?
- October 14, 2022
‘కేజీఎఫ్’ సినిమాతో కన్నడ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అంతవరకూ చాలా చిన్న పరిశ్రమగా భావించే కన్నడ సినిమాని ఆకాశానికెత్తేశారు. అంతటి గొప్ప విజయం నమోదు చేసింది ‘కేజీఎఫ్’ సినిమా.
ఇక, ఇప్పుడు మరోసారి కన్నడ పరిశ్రమ గురించి మాట్లాడుకునే అవకాశమొచ్చింది ‘కాంతార’ సినిమాతో. ఇటీవలే కన్నడలో విడుదలైన ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ఇక, ఈ నెల 15న తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయ్ ఇక ‘కాంతార’ తెలుగు రిలీజ్ ప్రమోషన్లు ఓ రేంజ్‌లో ఊదరగొట్టేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేశారు. దాంతో సినిమాపై ప్రత్యేకమైన దృష్టి పడింది. అంతేకాదు, ప్రబాస్ ఈ సినిమాకి సపోర్ట్ చేయడం మరో విశేషం. తన ఇన్‌స్టా వేదికగా ‘కాంతార’ సినిమా గురించి ప్రస్థావించాడు ప్రబాస్. దాంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయ్. తాజాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమాని వీక్షించేందుకు ప్రబాస్ సిద్ధమవుతున్నాడట.
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. సప్తమీ గౌడ హీరోయిన్‌గా నటించింది. అన్నట్లు రిషబ్ శెట్టి అంటే ఎవరనేది చాలా మందికి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మండన్నా మాజీ లవర్. ఈయనతోనే రష్మిక పెళ్లికి సిద్ధపడి, లాస్ట్ మినిట్‌లో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది.
తాజా వార్తలు
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!