తర్వలోనే అబుధాబిలో డ్రోన్స్ ద్వారా పార్సల్స్ డెలీవరీ

- October 14, 2022 , by Maagulf
తర్వలోనే అబుధాబిలో డ్రోన్స్ ద్వారా పార్సల్స్ డెలీవరీ

అబుధాబి: త్వరలోనే అబుదాబి సిటీలోని పలు ప్రాంతాల్లో పార్సిల్స్ అందజేసేందుకు డ్రోన్స్ వినియోగించనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్, స్కైగో, ఏడీ పోర్ట్స్ కంపెనీలను సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నాయి. ఈ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే అబుదాబిలోని పలు ప్రాంతాలకు డైరెక్ట్ గా డ్రోన్స్ ద్వారా ఫుడ్, మెడిసిన్, డాక్యుమెంట్స్ ను డెలివరీ చేయవచ్చు. మొదటగా తక్కువ దూరంలో పార్సిల్స్ ను డెలివరీ చేసేందుకు ట్రయల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దూర ప్రాంతాలకు కూడా డ్రోన్స్ వినియోగించనున్నారు. ఈ సేవల ద్వారా కస్టమర్లకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని ఏడీ పోర్ట్స్ గ్రూప్ సీఈవో డాక్టర్ నౌరా అల్ ధాహెరి చెప్పారు. భవిష్యత్ లో లాజిస్టిక్స్ లో డ్రోన్స్ దే కీలక పాత్ర కానుందని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com