ఆన్ లైన్ మోసాల పట్ల బి అలర్ట్-సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్

- October 14, 2022 , by Maagulf
ఆన్ లైన్ మోసాల పట్ల బి అలర్ట్-సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్

మనమా: ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని యాంటీ-కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్‌మెంట్ కు చెందిన యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ప్రజలకు సూచించింది. చాలా మంది మోసపూరిత కాల్స్ చేస్తూ ఓటీపీ షేర్ చేయాలని అడుగుతున్నారని సూచించారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తమ వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించింది.ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల వినియోగదారుల పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకులు కాల్స్, మెసేజ్ ల ద్వారా పాస్ వర్డ్ లు అడగవని...అలా ఎవరైనా అడిగితే అది మోసపూరితమైన కాల్స్ అని గుర్తించాలని అన్నారు. మోసపూరిత కాల్స్ వస్తే హాట్‌లైన్ 992కి కాల్ చేయాలని సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలను కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com