హీరోయిన్లు అంటే అందుకేనా.! నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.!

- October 15, 2022 , by Maagulf
హీరోయిన్లు అంటే అందుకేనా.! నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.!

‘సవ్య సాచి’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. పేరులో వున్న నిధి ఆమె అందంలోనూ వుందంటే అతిశయోక్తి కాదేమో. అందాల నిధి అంతే నిధి అగర్వాల్.
అయితే, ఆ అందం అడవి కాచిన వెన్నెలగానే మిగిలిపోతోంది. ఎందుకో తెలీదు నిధి అగర్వాల్‌‌ని ఆశించిన మేర మేకర్లు పట్టించుకోవడం లేదు. అరకొరా అవకాశాలతోనే సరిపెడుతున్నారు. ఎలాగోలా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ ఛాన్స్ దక్కించుకుంది. కానీ, అది సరిపోదు ఆమె అందానికి.
ఆ సంగతి అలా వుంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడిన మాటలు పెను సంచలనానికి కారణమవుతున్నాయ్. టాలీవుడ్‌లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మల్లాగే చూస్తారు. ఇక్కడ టాలెంట్ మాత్రమే వుంటే సరిపోదు. గ్లామర్ కూడా పుష్కలంగా వుండాలి.. అని చెప్పింది.
అంతేకాదు, అందుకే నేను అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదని కుండ బద్దలు కొట్టేసిందీ ముద్దుగుమ్మ. అలాగే, రెమ్యునరేషన్ విషయంలోనూ తన నుంచి ఎలాంటి డిమాండ్లూ లేవనీ, ఎంత ఇస్తే అంత తీసుకుంటానని క్లారిటీ ఇచ్చింది నిధి అగర్వాల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com