ఆ తప్పు చేయనంటోన్న పాయల్ రాజ్‌పుత్.!

- October 20, 2022 , by Maagulf
ఆ తప్పు చేయనంటోన్న పాయల్ రాజ్‌పుత్.!

‘ఆర్ఎక్స్100’ సినిమాతో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ బ్యూటీ అనే ముద్ర వేయించుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాకే ఇంత ఛాలెంజింగ్ రోల్ ఎంచుకుని పాయల్ రాజ్‌పుత్ పెద్ద సాహసమే చేసిందనుకోవాలి.
అయితేనేం, ఫస్ట్ మూవీకే సెన్సేషనల్ హిట్ కొట్టేసింది పాయల్ రాజ్‌పుత్. అయితే, ఆ తర్వాత ఆ ముద్రను పోగొట్టుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది పాయల్ రాజ్‌పుత్. 
వెంకటేష్, రవితేజ వంటి స్టార్స్ సరసన నటించాక కానీ, ఆ ఇమేజ్ పోలేదు పాయల్‌కి. తాజాగా ఆమె నటించిన ‘జిన్నా’ సినిమా రిలీజ్‌కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న ‘జిన్నా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా తన కెరీర్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకుంది పాయల్. కెరీర్ మొదట్లో కథల ఎంపికలో చాలా తప్పులు చేశాననీ, కొందరు తనను అలా ప్రేరేపించి, స్ర్కిప్టు వినకుండానే సినిమాలు ఓకే చేసేలా తప్పుదోవ పట్టించారని తెలిపింది. 
కానీ, ఇప్పుడు ఆ తప్పులు రిపీట్ చేయననీ, కథను పూర్తిగా విని, తనకు సెట్ అవుతుందా.? లేదా.? విశ్లేషించుకుని మరీ ఓకే చేస్తున్నానని పాయల్ చెప్పుకొచ్చింది. ‘జిన్నా’ అలా ఓకే చేసుకున్న ప్రాజెక్టే అనీ, ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని ఆశిస్తున్నానని పాయల్ ఆశా భావం వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com