హెల్త్ ఫెసిలిటీస్‌లలో మాస్క్ తప్పనిసరి

- October 20, 2022 , by Maagulf
హెల్త్ ఫెసిలిటీస్‌లలో మాస్క్ తప్పనిసరి

దోహా: ఆరోగ్య సదుపాయాలలో(హెల్త్ ఫెసిలిటీస్‌) మాస్కులు ధరించడం తప్పనిసరి అని ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్‌ఈ షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అధ్యక్షతన అమిరి దివాన్‌లో జరిగిన కేబినెట్ నిర్ణయించింది. అలాగే మూసివేసిన ప్రదేశాలలో, కస్టమర్‌లతో కమ్యూనికేట్ అయ్యే ఉద్యోగులు, కార్మికులు వారి పని సమయంలో మాస్క్‌లు ధరించాలని కేబినెట్ ఆదేశించింది. సమావేశం అనంతరం కేబినెట్‌ వ్యవహారాల సహాయ మంత్రి హెచ్‌ఈ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ సులైతీ ఈ మేరకు ప్రకటించారు. దీంతోపాటు ఎస్టేట్ చట్టాన్ని విభజించి షురా కౌన్సిల్‌కు రిఫర్ చేయడానికి సంబంధించిన ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సన్నాహాలపై కేబినెట్ సమీక్షించింది. నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కమిటీ పనికి సంబంధించి 10వ నివేదికను కేబినెట్ పరిశీలించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com