భక్తుల వాహనాలను దొంగతనం: కువైట్ పౌరుడు అరెస్ట్
- October 20, 2022
కువైట్ సిటీ: ప్రార్థనలు చేయడానికి వచ్చే వారి కార్లను దొంగలిస్తున్న వ్యక్తిని ఫర్వానియా డిటెక్టివ్‌లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అబ్దుల్లా అల్-ముబారక్ ప్రాంతంలోని అల్-మువాజిరి మస్జీదు సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రార్థనలకు వచ్చిన వారు పార్కింగ్ చేసిన వాహనాలను నిందితుడైన(33 ఏళ్ల కువైట్ పౌరుడు) దొంగిలించే వాడని మంత్రిత్వ శాఖ తెలిపింది. అతనికి క్రిమినల్ రికార్డు ఉందని, డ్రగ్స్ కు అతడు బానిసై దొంగతనాలకి పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. సదరు కార్ల దొంగ ఒక నెల క్రితమే జైలు నుండి విడుదలయ్యాడని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..