సెక్యూరిటీ గార్డులకు విశ్రాంతి, విరామం తప్పనిసరి
- October 20, 2022
రియాద్: సెక్యూరిటీ గార్డుల నియామకం, నిబంధనలు, కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించిన కొత్త నిబంధనలు, షరతులను ఆమోదించినట్లు సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి ఇంజి. అహ్మద్ అల్-రజ్హీ వెల్లడించారు. తాజా నిబంధనలు, షరతుల ప్రకారం.. సెక్యూరిటీ గార్డులకు విశ్రాంతి, ప్రార్థన, ఆహారం కోసం విరామం తప్పనిసరి అని.. ఏకధాటిగా ఐదు గంటల పాటు పని చేయించడం నేరమని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సెక్యూరిటీ గార్డులకు యూనిఫారాలు, ఎండ తగులకుండా అవసరమైన సౌకర్యాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం కోసం విధానపరమైన మాన్యువల్లో పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీ గార్డులను నియమించుకునే అన్ని రకాల సంస్థలకు, కంపెనీలకు కొత్త నిబంధనలు, షరతులు వర్తిస్తాయని తాజా ఉత్తర్వుల్లో అహ్మద్ అల్-రజ్హీ తెలియజేశారు. సెక్యూరిటీ గార్డుల విభాగంలో పని నాణ్యతను పెంపొందించడం, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలలో కార్మికుల స్థిరత్వాన్ని తాజా నిర్ణయం ముఖ్య ఉద్దేశం అన్నారు. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రచురించిన తేదీ నుండి 180 రోజులకు మించకుండా ఈ నిబంధనలను పాటించాలని సంబంధిత ప్రైవేట్ రంగ సంస్థలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి