కువైట్ వెలుపల ఆరునెలలు.. ప్రవాసుల రెసిడెన్సీ రద్దు

- October 25, 2022 , by Maagulf
కువైట్ వెలుపల ఆరునెలలు.. ప్రవాసుల రెసిడెన్సీ రద్దు

కువైట్: 2022 ఆగస్టు 1 నుండి దేశం వెలుపల ఆరు నెలలు కంటే ఎక్కువగా ఉన్న విదేశీయుల రెసిడెన్సీ ఆటోమెటిక్ గా రద్దు అవుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ కొత్త సర్క్యులర్‌లో ప్రకటించింది. సర్క్యులర్ ప్రకారం.. ఆర్టికల్స్ 17-19-22-23-24 ప్రకారం దేశంలో రెసిడెన్సీని కలిగి ఉన్న విదేశీయుడు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉంటే 2023 ఫిబ్రవరి 1 నుండి ఆటోమెటిక్ గా రద్దు అవుతుంది. ఆర్టికల్ 18లో ఉన్న ప్రవాసులకు, ఆరు నెలల నియమం 2022 నవంబర్ 1 నుండి ఇప్పటికే అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కొత్త సర్క్యులర్ ప్రకారం ఇప్పుడు అన్ని ఇతర కేటగిరీ వీసాలకు వర్తింపజేశారు. ఆరు నెలల గడువును ఆగస్టు 1 నుండి లెక్కించబడుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com