వివాహితను వేధించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు
- October 25, 2022
సౌదీ: తూర్పు ప్రావిన్స్‌లోని అల్-అహ్సాలోని క్రిమినల్ కోర్టు వివాహిత మహిళను లైంగికంగా వేధించినందుకు దోషిగా తేలిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే అతని వాట్సాప్ ఖాతాను మూసివేయాలని, మొబైల్ ఫోన్‌ను జప్తు చేయాలని కోర్టులో మొదటి జాయింట్ క్రిమినల్ సర్క్యూట్ తీర్పు చెప్పింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధిత మహిళ భర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై అభియోగాలు నమోదు చేసింది. వాట్సాప్‌లో లైంగిక ఉద్దేశ్యంతో అసభ్యకరమైన సందేశాలను పంపి, లైంగిక సంపర్కానికి ఆహ్వానించడం ద్వారా మహిళను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడని సదరు వ్యక్తిపై ఆరోపణలు నమోదయ్యాయి. విచారణ సందర్భంగా నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు. సైబర్ క్రైమ్ నిరోధక చట్టంలోని ఆర్టికల్ 6-8 ప్రకారం అతనికి 4 సంవత్సరాల 6 నెలల జైలుశిక్ష, మరో 6 నెలలు క్రమశిక్షణా కింద కోర్టు శిక్షను ఖరారు చేసింది.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







