డ్రగ్స్ వినియోగం, పంపిణీ: 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా
- October 26, 2022
దుబాయ్: మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు, ఉపయోగించడంతోపాటు వాటిని ఇతరులకు పంపిణీ చేసినందుకు 43 ఏళ్ల అరబ్ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, Dh 50,000 జరిమానాను దుబాయ్ క్రిమినల్ కోర్ట్ విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత మే నెలలో నిందితుడు సిలికాన్ ఒయాసిస్ ప్రాంతంలో మాదకద్రవ్యాలను కలిగి ఉన్నాడని, వాడుతున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో నార్కోటిక్ అధికారులు దాడి చేసి నిందితుడితోపాటు మరికొందరిని, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు గంజాయిని వాడినట్లు అంగీకరించారు. కేసు ను విచారించిన క్రిమినల్ కోర్ట్.. ప్రధాన నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధించింది. మిగతా నిందితులను మాదకద్రవ్యాల దుర్వినియోగం ఆరోపణలపై మిస్‌డిమీనర్స్ కోర్టుకు రిఫర్ చేశారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత నిందితులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







