‘ఊర్వశివో రాక్షసివో’.! గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారే.!

- October 31, 2022 , by Maagulf
‘ఊర్వశివో రాక్షసివో’.! గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారే.!

ఈ మధ్య ‘మీర్జాపూర్’ అనే ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ నిండా బూతులే బూతులు. డైరెక్ట్‌గా మాట్లాడేస్తుంటారు. అయితే, మన టాపిక్ ఈ వెబ్ సిరీస్ కానే కాదండోయ్.
‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్‌తో అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఈ సినిమా ప్రమోషన్లు తెగ ఊదరగొడుతున్నారు మరి. తెలియకుండా ఎందుకుంటుంది.
అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో అల్లు శిరీష్‌తో జోడీ కడుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ భీభత్సమైన రొమాంటిక్ సన్నివేశాలతోనే ఈ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు కూడా. ఇక సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి బాలయ్య ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా హిలేరియస్‌గా వుంది. వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు తమదైన కామెడీ టైమింగ్‌తో డైలాగులు అదరగొట్టేస్తున్నారు. ఇక, అల్లు శిరీష్ కూడా తనలోని హీరోని సరికొత్తగా పరిచయం చేస్తున్నాడీ సినిమాతో.
అయితే, ట్రైలర్ నిండా డబుల్ మీనింగ్ డైలాగులూ.. సీరియల్ ఆర్టిస్టుల ప్రస్థావనతో పోల్చిన కామెడీ టైమింగులూ.. ఇలా ఆధ్యంతం ఆకట్టుకునేలా వుంది ట్రైలర్. డబుల్ మీనింగ్ డైలాగులతో ట్రైలర్‌ని నింపేశారు.. అంటూ ఎక్కడ కామెంట్లు వస్తాయో అనుకున్నారో ఏమో.. ఆ డైలాగ్ కూడా ట్రైలర్ చివరలో వెన్నెల కిషోర్‌తో చెప్పించేసి ఆడియన్స్ ఫోకస్‌ని మళ్లీ తమవైపు తిప్పేసుకున్నారు. ఆ టైమింగ్‌లో వెన్నెల కిషోర్ వాడిన పదమే ‘మీర్జాపూర్’. అదీ సంగతి. ఏమో, ట్రైలర్ కట్ చేసిన విధానం చూస్తుంటే, శిరీష్ ఈ సినిమాతో గట్టెక్కేలానే వున్నాడు చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com