మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కువైట్ ప్రచారం

- November 01, 2022 , by Maagulf
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కువైట్ ప్రచారం

కువైట్: ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అల్-నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాలని కువైట్ కేబినెట్ నిర్ణయించింది. సోమవారం సీఫ్ ప్యాలెస్‌లో జరిగిన కేబినెట్ వారపు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ప్రధానమంత్రి, కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి బరాక్ అల్-షీటన్ తెలిపారు. స్థానిక-అంతర్జాతీయ నిపుణుల సహాయంతో ప్రజల్లో అవగాహన పెంపొందించడం, డ్రగ్స్‌పై పోరాటం చేయడం, డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అల్-షీటన్ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com