Dh100కే యూఏఈ మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- November 01, 2022
యూఏఈ: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022కి హాజరయ్యే అభిమానుల నుండి మల్టీ ఎంట్రీ పర్యాటక వీసాల కోసం యూఏఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఫిఫా ప్రపంచకప్ మ్యాచులను ప్రత్యక్షంగా చూసేందుకు హయ్యా కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ఫుట్ బాల్ అభిమానులను కోరింది. అలాగే హయ్యా కార్డును కలిగి ఉన్న అంతర్జాతీయ అభిమానులు ICP వెబ్సైట్లో యూఏఈ మల్టీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రపంచ కప్ అభిమానులు మల్టీ ఎంట్రీ వీసాతో 90 రోజుల వ్యవధిలో అనేక సార్లు ఎమిరేట్స్లోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. వీసా రుసుమును వన్-టైమ్ ఛార్జ్ Dh100కి తగ్గించినట్లు వెల్లడించింది. ఆపై సాధారణ రుసుముతో దీనిని మరో 90 రోజులు పొడిగించుకునే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







