Dh100కే యూఏఈ మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా

- November 01, 2022 , by Maagulf
Dh100కే యూఏఈ మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా

యూఏఈ: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022కి హాజరయ్యే అభిమానుల నుండి మల్టీ ఎంట్రీ పర్యాటక వీసాల కోసం యూఏఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఫిఫా ప్రపంచకప్ మ్యాచులను ప్రత్యక్షంగా చూసేందుకు హయ్యా కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ఫుట్ బాల్ అభిమానులను కోరింది. అలాగే హయ్యా కార్డును కలిగి ఉన్న అంతర్జాతీయ అభిమానులు ICP వెబ్‌సైట్‌లో యూఏఈ మల్టీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రపంచ కప్ అభిమానులు మల్టీ ఎంట్రీ వీసాతో 90 రోజుల వ్యవధిలో అనేక సార్లు ఎమిరేట్స్‌లోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. వీసా రుసుమును వన్-టైమ్ ఛార్జ్ Dh100కి తగ్గించినట్లు వెల్లడించింది. ఆపై సాధారణ రుసుముతో దీనిని మరో 90 రోజులు పొడిగించుకునే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com