700 మహిళా న్యాయవాదులకు కొత్తగా లైసెన్సులు
- November 01, 2022
రియాద్: 700 మహిళా న్యాయవాదులకు న్యాయ మంత్రిత్వ శాఖ కొత్తగా లైసెన్సులను జారీ చేసింది. దీంతో సౌదీలోలైసెన్స్ పొందిన మహిళా న్యాయవాదుల సంఖ్య 2,100కి చేరుకుంది. న్యాయవాదులు, ట్రైనీల కోసం నజీజ్ పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని లేదా న్యాయ సంస్థ సాధారణ పరిపాలన కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు లైసెన్సులు పొందవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నజీజ్ పోర్టల్ లో ట్రైనీ లాయర్ని ఒక లాయర్ నుండి మరొక లాయర్‌కి బదిలీ చేయడానికి అభ్యర్థనను సమర్పించే అప్షన్ అందుబాటులో ఉందని, అలాగే ట్రైనీ లాయర్ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని కూడా ఆన్ లైన్ ద్వారా సులువుగా పొందవచ్చని న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







