ఇండియన్ ఎంబసీలో ఘనంగా భారత జాతీయ ఐక్యతా దినోత్సవం
- November 01, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఎంబసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. భారత జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా కువైట్‌లోని భారతీయులకు డా. వినోద్ గైక్వాడ్ ప్రారంభ ఉపన్యాసంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలకు ముందు వచ్చే 25 సంవత్సరాల అమృతకాల్‌కు పంచప్రాన్స్-5 సూత్రాలను నిర్దేశించారని, ఇందులో ఐక్యత, ధర్మం ఒకటని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారని వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, పాటలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరితను ప్రదర్శించారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా భారత రాయబార కార్యాలయం కువైట్‌లోని భారతీయ పాఠశాలలతో కలిసి ప్రత్యేక ఐక్య మానవహారాలు, ఐక్కత పరుగు సహా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో వందలాది మంది భారతీయ విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలో ఐక్యత, టీ ప్రత్యేక సంబంధాన్ని తెలిపే ప్రత్యేక Uni-TEA స్టాల్స్‌ను రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







