సమంత రాకతో భారీ బడ్జెట్ మూవీగా ‘యశోద’.! స్టామినా చూపిస్తుందా.?
- November 09, 2022
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘యశోద’. మరో రెండు రోజుల్లో అనగా, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ విన్నా ‘యశోద’ సినిమా గురించే ఊసు వినబడుతోంది.
ఇటీవల సమంత ‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన పడి, తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అంతటి అనారోగ్యంతోనూ సినిమా కోసం ప్రమోషన్స్‌లో పాల్గొంది సమంత. అది సమంత డెడికేషన్‌కి సాక్ష్యం.
సినిమా అంటే సమంతకు ఎంత ప్యాషనో ఈ అంశం ప్రూవ్ చేస్తుంది. అయితే, ‘యశోద’ సినిమాని మొదట లో బడ్జెట్ మూవీగా అనుకున్నారట. కానీ, సమంత రాకతో ఈ సినిమా దాదాపు 40 కోట్ల బడ్జెట్ మూవీగా రూపు దిద్దుకుందట. అంతేకాదు, సమంత యాక్షన్ సీన్స్, పర్‌ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా చెబుతున్నారు.
సరోగసీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం రియల్ ఇన్సిడెంట్లను టచ్ చేసినట్లు మేకర్లు చెబుతున్నారు. హరి హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్ పోషిస్తోంది. ట్రైలర్ రిలీజయ్యాకా ‘యశోద’ అంచనాలు పెంచేసింది. చూడాలి మరి, సమంత ఈ సినిమాతో తన స్టామినా ప్రూవ్ చేసుకుంటుందో లేదో.!
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..