ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ లో ఉపాధ్యాయులు, టాపర్లకు సన్మానం

- November 10, 2022 , by Maagulf
ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ లో ఉపాధ్యాయులు, టాపర్లకు సన్మానం

బహ్రెయిన్: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB)లో 2021-2022 CBSE X, XII పరీక్షలో  టాపర్‌లుగా నిలిచిన వారికి ఘనంగా సన్మానించారు. ఇసా టౌన్ క్యాంపస్‌లోని పాఠశాల ఆడిటోరియంలో నవంబర్ 7న జరిగిన వార్షిక అకడమిక్ అవార్డుల వేడుకల్లో దాదాపు 100 మంది టాపర్‌లను మెడల్స్, సర్టిఫికేట్‌లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు లాంగ్ సర్వీస్ అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఎంబసీ సెకండ్ సెక్రటరీ రవికుమార్ జైన్, ఐఎస్‌బి చైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్, సెక్రటరీ సాజి ఆంటోని, వైస్ చైర్మన్ జయఫర్ మైదానీ, ఇసి సభ్యులు మహ్మద్ ఖుర్షీద్ ఆలం, బిను మన్నిల్ వరుగీస్, ప్రేమలత ఎన్‌ఎస్, రాజేష్ నంబియార్, అజయకృష్ణన్ వి, ప్రిన్సిపాల్ విఆర్ పళనిస్వామి, రిఫా క్యాంపస్ పమేలా జేవియర్, స్టాఫ్ రిప్రజెంటేటివ్ జాన్సన్ కె దేవస్సీ, వైస్ ప్రిన్సిపల్స్, హెచ్‌డిలు, ప్రధాన ఉపాధ్యాయులు, ఆహ్వానిత అతిథులు పెద్దయెత్తున హాజరయ్యారు.

స్వర్ణ పతక విజేతలలో 12వ తరగతి పాఠశాల టాపర్లు అన్నా సాజు ముల్లప్పిల్లి (98.2%), ద్వారకా త్యాగరాజన్ (98%), బావ్య కొప్పల్ (96.6%), దిక్పాల్ ప్రకాష్ భాయ్ పటేల్ (96.6%), లియో థామస్ డొమినిక్ (96.6%) ఉన్నారు. అలాగే పదో తరగతి పాఠశాల టాపర్లు హైఫా మొహమ్మద్ షిరాజ్ (99%), మరియం థామస్ (99%), రింజ్ లోజీ (97.8%), స్వాతి సురేష్ (97.4%), తీర్ధ హరీష్ (97.4%)  స్వర్ణ పతకాలను అందుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com