అంబులెన్స్‌లకు దారి ఇవ్వని వాహనదారులకు జరిమానా

- November 10, 2022 , by Maagulf
అంబులెన్స్‌లకు దారి ఇవ్వని వాహనదారులకు జరిమానా

రియాద్: అంబులెన్స్‌లకు దారి ఇవ్వని వాహనదారులపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని సౌదీ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అల్-బస్సామి హెచ్చరించారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే దాన్ని ఉల్లంఘనగా భావించి వారికి జరిమానా విధించబడుతుందని తెలిపారు. భద్రత, ట్రాఫిక్ విభాగాలలో ఆటోమేషన్ వేగాన్ని పెంచాయని అల్-బస్సామి చెప్పారు. ఇది ట్రాఫిక్ భద్రత స్థాయిని పెంచడానికి దోహదపడిందని ఓ కార్యక్రమంలో పాల్గొన సందర్భంగా ముహమ్మద్ అల్-బస్సామి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com