10 నెలల్లో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు

- November 10, 2022 , by Maagulf
10 నెలల్లో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు

యూఏఈ: 2022 జనవరి - అక్టోబర్ మధ్య యూఏఈలో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు అయినట్లు  మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వెల్లడించింది. యూఏఈలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు ప్రైవేట్ రంగ సంస్థల్లో 485,000 తనిఖీలు చేపట్టారని, ఈ సందర్భంగా 26,104 కార్మిక చట్ట ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తెలిపింది. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాట్లు పేర్కొన్నది. కార్మిక ఉల్లంఘనలలో వేతనాలు చెల్లించని 2,973 కేసులు నమోదయినట్లు తెలిపింది. ఈ కేసులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఉద్యోగుల పాస్‌పోర్ట్‌లను యాజమాన్యాలు వెనక్కు తీసుకున్న 178 కేసుల్లో 132 పరిష్కరించబడ్డాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com