అఫ్గనిస్తాన్‌లో పార్కులు, జిమ్‌లలోకి మహిళలకు నో ఎంట్రీ...

- November 11, 2022 , by Maagulf
అఫ్గనిస్తాన్‌లో పార్కులు, జిమ్‌లలోకి మహిళలకు నో ఎంట్రీ...

అఫ్గనిస్తాన్‌: అఫ్గనిస్తాన్‌లో పాలన తన ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై నిరంతరం కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే పలు ఆంక్షలతో మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేసిన తాలిబన్లు మరో కొత్త రూల్ తీసుకొచ్చారు. పార్కులు, జిమ్‌లలోకికి మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు.

అన్ని రకాల అమ్యూజ్‌మెంట్ పార్కుల్లోకి ప్రవేశాన్ని నిషేధం విధించారు. ఇప్పటికే రాజధాని కాబూల్‌లో ఈ నిబంధన అమలువుతోంది. అఫ్గనిస్తాన్‌ నైతిక శాఖా మంత్రి నుంచి ఈ ఆదేశాలు జారీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విషయం తెలియకుండా పార్కుల దగ్గరికి వెళ్లిన మహిళలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆడవాళ్లను అనుమతించవద్దని తమకు ఆదేశాలు వచ్చినట్లు పార్కు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నిబంధన అమలుతో అఫ్గాన్ మహిళలు నిరాశ చెందుతున్నారు. పార్కుల్లో రకరకాల ఈవెంట్స్, గేమ్స్ వంటివి ఉంటాయి. తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి పార్కుల్లోకి వెళ్లి గడిపి వద్దామని భావిస్తున్న ఆడవాళ్లను ఈ రూల్ ఇబ్బంది పెడుతోంది. ఒక మహిళ తన పిల్లలతో పార్కులో బంప్‌డ్ కార్స్ వంటివి రైడ్ చేద్దామని రాగా… ఆమెను పార్కు సిబ్బంది లోపలికి అనుమతించలేదు.

దీంతో తాను చాలా నిరాశ చెందినట్లు ఆమె చెప్పింది. లోపలికి అనుమతించాలని అధికారులను ఎంత వేడుకున్నా కనికరించలేదని ఆమె ఆవేదనతో చెప్పింది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక మహిళలపై ఇలాంటి ఆంక్షలు ఎక్కువయ్యాయి. విద్య, ఉద్యోగం వంటి అనేక అంశాల్లో తాలిబన్లు మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. మగ తోడు లేకుండా ఆడవాళ్లు బయటకు రాకూడదు. అలాగే హిజాబ్ ధరించి ముఖాన్ని పూర్తిగా కవర్ చేయాలి. బాలికల చదువుపైనా నియంత్రణ విధిస్తున్నారు. కొన్నిచోట్ల మహిళలు ఆఫీసుల్లో పని చేయడంపై కూడా నిషేధం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com