చైనాలో మరోసారి విజృంభిస్తున్న కరోనా కేసులు
- November 11, 2022
బీజింగ్: చైనాలో కోవిడ్ కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 వేల 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేనివారిలో కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా రాజధాని బీజింగ్ లో సిటీ పార్కులను మూసివేశారు. అలాగే పలు కోవిడ్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. అలాగే స్కూల్స్ కూడా మూతబడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. షాపులు, రెస్టారెంట్లు కూడా బంద్ అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు పరుస్తుంది.
గాంగ్ఝౌ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ కొద్దిరోజులుగా రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న హైఝులో ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడంతో ఆదివారం వరకు కఠిన లాక్డౌన్ విధించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంట్లో ఒక్కరు మినహా ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!