విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ

- November 12, 2022 , by Maagulf
విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ

అమరావతి: ప్రధాని మోడీ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో ఆయన సభాస్థలికి విచ్చేశారు. ఆయనతో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మోడీకి కీలక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధానికి జగన్ శాలువా కప్పి సత్కరించారు.శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు.

అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను జాతికి అంకితం చేయనున్నారు. భారీ బహింరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com