‘యశోద’ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు.! సమంత స్టామినా అదే.!
- November 12, 2022
సరోగసీ నేపథ్యంలో గతంలోనే చాలా సినిమాలొచ్చాయ్. హిందీలో ‘మిమి’ పెద్ద హిట్ అయ్యింది. అప్పటికే తెలుగులో ‘ఒబామా’ అనే చిన్న సినిమా వచ్చి వెళ్లిపోయింది.
సరోగసీ అంటే కొత్తగా చూపించేదేముంటుంది.? అనుకున్నారంతా. కానీ, సమంతలాంటి ఓ స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిందంటే, అందులో ఖచ్చితంగా ఏదో విషయమే వుంటుందనుకున్నారు.
నిజంగానే ‘యశోద’ లో మంచి విషయముంది. సమంత పర్ఫామెన్స్తో దాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. సరోగసీ మాఫియా నేపథ్యంతో యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దారు.
సమంత యాక్షన్ సీన్సే ఈ సినిమాకి మెయిన్ హైలైట్. దాంతో, ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచీ ‘యశోద’ ధియేటర్లకు జనం బాగానే ఎట్రాక్ట్ అయ్యారు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ పండితుల అంచనా.
తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ఈ సినిమాకి మంచి వసూళ్లు రాగా, ఓవర్సీస్లోనూ ‘యశోద’ దూసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల పైగా వసూళ్లు సాధించగా, ఓవర్ సీస్లో నిన్న ఒక్కరోజే 80 లక్షలు రాబట్టింది ‘యశోద’.
ఓవరాల్‌గా 3.25 కోట్లు గ్రాస్ సాధించింది ఫస్ట్ డే ‘యశోద’. సమంత స్టామినాకి ఇది తక్కువే అయినా, ఆశించిన రీతిలో ప్రమోషన్లు జరగకపోయినా ‘యశోద’ బాగానే గట్టెక్కిందని అంటున్నారు. అలాగే, ఓటీటీలో ‘యశోద’ రైట్స్‌ని 25 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!