గుంబాల్ 3000 అంతర్జాతీయ మోటార్ షోను నిర్వహించనున్న ఒమన్
- November 13, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్ నవంబర్ 13 నుండి 15 వరకు గుంబాల్ 3000 ఇంటర్నేషనల్ మోటార్ షోను నిర్వహించనుంది. ఇందులో క్రీడలు, సంగీతం, వ్యాపార రంగాలలోని ప్రముఖులతో సహా ప్రపంచంలోని ప్రముఖ స్పోర్ట్స్ కార్ల బృందాలు పాల్గొంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ ఐన్ నుండి సాగే మార్చ్.. అల్ బురైమి గవర్నరేట్ నుండి ఒమన్‌లోకి ప్రవేశిస్తుంది. అల్ దహిరా, అల్ దఖిలియా గవర్నరేట్ల మీదుగా సాగి జబల్ అల్ అఖ్దర్ విలాయత్ చేరుకుంటుందని నిర్వాహకులు వెల్లడించారు. మూడవ రోజున "గుంబల్ 3000" మార్చ్ మీర్బాత్ విలాయత్ నుండి కోస్టల్ రోడ్ హాసిక్ - షువైమియా గుండా దుక్మ్ విలాయత్ వరకు సాగుతుందన్నారు. ఒమన్ సాంస్కృతిక, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖలో స్పోర్ట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ హిషామ్ బిన్ జుమా అల్ సినానీ.. అంతర్జాతీయ ఈవెంట్లు, టోర్నమెంట్లను ప్రోత్సహించడంలో ఒమన్ ముందుంటుందన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!