ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ కేసు.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
- November 13, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న IBS కాలేజీ ర్యాగింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూనియర్ విద్యార్థిపై పది మంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. అటు ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.
ర్యాగింగ్ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తుండగా.. నాలుగు పోలీసు బృందాలు విచారణలో పాల్గొంటున్నాయి. ఈ నెల 1వ తేదీన ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీ కుదిర్చి పంపారు. దీనికి సంబంధించి బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో 12మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వర్సిటీ యాజమాన్యం ఆ 12మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐబీఎస్ లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాఫ్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై వేటు పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







