భారత్ లో 10 బిలియన్ డాలర్లు దాటిన యూఏఈ పెట్టుబడులు

- November 13, 2022 , by Maagulf
భారత్ లో 10 బిలియన్ డాలర్లు దాటిన యూఏఈ పెట్టుబడులు

అబుధాబి: భారతదేశంలో పునరుత్పాదక శక్తి, టెలికాం, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇతర రంగాలలో $10 బిలియన్లకు పైగా పెట్టుబడులను యూఏఈ సావరిన్ వెల్త్ ఫండ్స్ పెట్టాయని అబుధాబిలో జరిగిన ఒక కార్యక్రమంలో యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) మూడు రోజుల వార్షిక సదస్సు NATCON 2022లో సంజయ్ సుధీర్ పాల్గొని మాట్లాడారు. 2014 నుండి ద్వైపాక్షిక సంబంధాలలో వేగవంతమైన పురోగతిని సాధించామన్నారు. ఫిబ్రవరి 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై సంతకం చేయడంతో ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం అయిందన్నారు. షేక్ మహ్మద్ బిన్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ప్రారంభించిన ఈ సదస్సులో భారతదేశం నుండి 1,300 మందికి పైగా డెవలపర్లు పాల్గొంటున్నారు. క్రెడాయ్ అనేది భారతదేశంలోని 13,000 కంటే ఎక్కువ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లకు భాగస్వామ్యం వహిస్తుంది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ అధ్యక్షులు హర్ష్ వర్ధన్ పటోడియా, బొమన్ ఇరానీ, ఛైర్మన్ సతీష్ మాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com