కువైట్ లో పెరగనున్న రెసిడెన్సీ, విజిట్ వీసా ఫీజులు!
- November 14, 2022
కువైట్: కొత్త రెసిడెన్సీ చట్టం, విజిట్ వీసాల జారీ తదితర అంశాలపై చర్చించడానికి ఈ నెలాఖరులో కువైట్ పార్లమెంటరీ అంతర్గత- రక్షణ కమిటీ సభ్యులతో అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబా మధ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లను జారీ చేసే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రెసిడెన్సీల పరిమితికి కొత్త చట్టం, వీసా ఫీజులు మూడు రెట్లు పెరుగుతాయని అందరూ భావిస్తున్నారు. అలాగే రెసిడెన్సీ ఉల్లంఘించిన వారిపై కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రి షేక్ తలాల్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీకి పంపిన ముసాయిదా చట్టంలో కొత్త రెసిడెన్సీ చట్టంలో ఐదేళ్ల రెసిడెన్సీ అనుమతి ఉందన్నారు. అయితే, ఈ అనుమతి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు లేదా కువైట్ మహిళల పిల్లలకు కాదని షేక్ తలాల్ వివరించినట్లు కొందరు ఎంపీలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







