బర్త్‌డే స్పెషల్.! అందుకే నయన్ లేడీ సూపర్ స్టార్.!
- November 18, 2022
సౌత్ క్వీన్‌గా అరుదైన గౌరవం దక్కించుకున్న ముద్దుగుమ్మ నయనతార. కమర్షియల్ సినిమాలైనా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలైనా ముందుగా గుర్తొచ్చే పేరు నయనతార.
తెలుగుతో పాటూ, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందడం అంటే అంత ఆషా మాషీ విషయం కాదు. అందుకే నయనతార ది స్పెషల్.
సౌత్‌లో ఏ హీరోయిన్ చేయని విధంగా 75 సినిమాల్లో నటించింది ఇంతవరకూ నయన్. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు అభిమానులు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా, ప్రమోషన్లకు మాత్రం రానే రాదు నయన తార. కేవలం షూటింగ్ వరకే తన డేట్లు కేటాయిస్తుంటుంది.
అయినా కానీ, హీరోయిన్గా క్రేజ్ ఎంత మాత్రమూ తగ్గకపోవడం కేవలం నయన తారకే చెల్లిందనాలేమో. తెలుగులో ‘లక్ష్మి’ సినిమాతో తెరంగేట్రం చేసింది నయన తార. అంతకు ముందే, ‘గజిని’, ‘చంద్రముఖి’ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైంది.
లేటెస్టుగా ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీలక పాత్రలో కనిపించి మెప్పించిన నయన్, ఈ రోజు తన 38 వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్‌డే టు యు నయన తార.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!