ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’
- November 19, 2022
హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక రేపు హైదరాబాద్ లో జరగబోతుంది. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేని అల్లరి నరేష్ కు నాంది మూవీ సూపర్ హిట్ అయ్యి..నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించి..నరేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న నరేష్..’ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే మూవీ తో నవంబరు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెంచగా…రేపు చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులోని ‘పార్క్ హయత్’లో ప్లాన్ చేశారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.
మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ – జీ స్టూడియోస్ వారు నిర్మిస్తుండగా, ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అల్లరి నరేశ్ గవర్నమెంట్ ఆఫీసర్‌గా ఈ మూవీలో కనించబోతుండగా.. ఎలక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో గిరిజనులు, వారి కష్టాలపై అల్లుకున్న కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది. ‘జాంబీ రెడ్డి’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!