నవంబర్ 22 నుండి ‘జ్యువెలరీ అరేబియా’

- November 21, 2022 , by Maagulf
నవంబర్ 22 నుండి ‘జ్యువెలరీ అరేబియా’

బహ్రెయిన్: మిడిల్ ఈస్ట్‌లోని అతిపెద్ద ఆభరణాలు, వాచ్ ఎగ్జిబిషన్ ‘జ్యువెలరీ అరేబియా 2022’ నవంబర్ 22న ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో ప్రారంభమవుతుంది. జ్యువెలరీ అరేబియా 30వ ఎడిషన్ కోసం ప్రపంచంలోని అత్యుత్తమ ఆభరణాలు, వాచ్ బ్రాండ్‌ ల సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 26 వరకు కొనసాగుతుంది.

దాదాపు 30కి పైగా దేశాల నుండి 650కి పైగా జ్యువెలరీ, వాచ్ తయారీ సంస్థలు స్టాల్స్ ఒకేచోట సందడి చేయనున్నాయి. పెర్ల్ డిస్కవరీ జోన్, బహ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పెరల్స్ & జెమ్‌స్టోన్స్ (DANAT) భాగస్వామ్యంతో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు.

జ్యువెలరీ అరేబియా 2022.. హాల్స్ 3, 5, 6, 7, 8లో నిర్వహించనున్నారు. నవంబర్ 22 - 25 తేదీలలో సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు.. నవంబర్ 26న మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com