పైనాపిల్స్‌లో గంజాయి స్మగ్లింగ్.. ఆఫ్రికన్ అరెస్ట్
- November 21, 2022
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 వద్ద ఒక ఆఫ్రికన్ ప్రయాణికుడిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు పైనాపిల్స్‌లో గంజాయిని దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించినట్లు ప్యాసింజర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ (యాక్టింగ్) డైరెక్టర్ ఖలీద్ అహ్మద్ తెలిపారు. ఓ ఆఫ్రికన్ దేశం నుండి వస్తున్న పైనాపిల్స్ ఉన్న కార్డ్బోర్డ్ పెట్టెను ఇన్స్పెక్టర్లు తనిఖీ చేయడంతో ఈ అరుదైన స్మగ్లింగ్ విషయం బయట పడిందన్నారు. 417.30 గ్రాముల బరువున్న 399 గంజాయి రోల్స్‌ను పైనాపిల్స్‌లో దాచి ప్యాకింగ్ చేశారని వివరించారు. పట్టుబడిన గంజాయిని దుబాయ్ పోలీసులోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్‌కు అప్పగించినట్లు తెలిపారు. స్మగ్లర్లు తొలుత చిన్న మొత్తాల్లో డ్రగ్స్ పంపుతారని, వారి ప్రయత్నం సఫలమైతే పెద్ద మొత్తంలో పంపేందుకు ప్రయత్నిస్తారని ఖలీద్ అహ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్