ఎమ్మెల్యే కేథరీన్, బన్నీ కోసం సూపర్ విలన్ కానుందా.?
- November 21, 2022‘సరైనోడు’ సినిమాలో బ్యూటిఫుల్ ఎమ్మెల్యేగా నటించి మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ కేథరీన్. రీసెంట్గా ‘బింబిసార’లో నటించి మెప్పించింది. తాజాగా కేథరీన్ ‘పుష్ప 2’లో ఛాన్స్ కొట్టేసిందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ వున్న ఓ లేడీ క్యారెక్టర్ క్రియేట్ చేశాడట సుక్కు మాస్టర్. అఫ్కోర్స్.! ఆల్రెడీ నెగిటివ్ షేడ్స్ రోల్లో అనసూయ నటిస్తోందనుకోండి. మొదటి పార్ట్‌లోని దాక్షాయణి పాత్రను ఈ పార్ట్‌లోనూ కంటిన్యూ చేయనున్నాడట. ఆ రోల్‌తో పాటూ, మరో నెగిటివ్ లేడీ రోల్ కూడా వుండబోతోందనీ తెలుస్తోంది.
బహుశా ఆ పాత్ర ఫహాద్ ఫాజిల్ భార్య రోల్ అయ్యుండొచ్చని అనుకుంటున్నారు. ఆ రోల్ అందంగా కనిపిస్తూనే విషం చిమ్మే పాత్రనీ తెలుస్తోంది. ఆ పాత్ర కోసమే కేథరీన్ పేరు పరిశీలిస్తున్నారట. బన్నీ కూడా ఆ రోల్ కోసం కేథరీన్నే ప్రిఫర్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ ప్రచారం నిజమైతే, కేథరీన్ మరో మంచి రోల్ కొట్టేసినట్లే అంటూ ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు