భారత్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ‘ఎయిర్ సువిధ’ రద్దు
- November 21, 2022
న్యూఢిల్లీ: భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ 19 వ్యాప్తి సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఎయిర్ సువిధ ఫారాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఎయిర్ సువిధ అనేది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా తీసుకొచ్చిన కాంటాక్ట్‌లెస్ ప్రక్రియ(సెల్ఫ్ డిక్లరేషన్). భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరు ఈ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ రద్దు నిర్ణయం నవంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. ఇకపై విదేశాల నుండి భారతదేశానికి వెళ్లే వ్యక్తులు ఎయిర్ సువిధ ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







