బుర్జ్ ఖలీఫాపై న్యూఇయర్ వేడుకలు: రికార్డు సృష్టించేలా బాణసంచా ప్రదర్శన

- November 25, 2022 , by Maagulf
బుర్జ్ ఖలీఫాపై న్యూఇయర్ వేడుకలు: రికార్డు సృష్టించేలా బాణసంచా ప్రదర్శన

దుబాయ్: 2023 నూతన సంవత్సర వేడుకలకు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సిద్ధమవుతోంది. ఈసారి స్పెషల్ బాణాసంచా ప్రదర్శనతో కొత్త ప్రపంచ రికార్డులను నెలకోల్పడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాస్టర్ డెవలపర్ ఎమ్మార్ ప్రకటించింది. కొత్త సంవత్సర ప్రారంభానికి సూచనగా 'ప్రపంచంలోనే అతిపెద్ద లేజర్ డిస్‌ప్లే'ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతో 828-మీటర్ల బుర్జ్ ఖలీఫా అత్యాధునిక లేజర్ షో కేంద్రంగా మారుతుందన్నారు. ఈ లేజర్ కాంతి కిరణాలు ఇప్పటివరకంటే అత్యంత ఎక్కువ దూరం వరకు కనిపిస్తాయన్నారు. 2010 నుండి ప్రఖ్యాత పైరోటెక్నిక్ ప్రదర్శన ద్వారా బుర్జ్ ఖలీఫా వద్ద అద్భుతమైన బాణసంచా ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్ వెల్లడించింది. బుర్జ్ ఖలీఫా బేస్ వద్ద ఉన్న దుబాయ్ ఫౌంటెన్ దగ్గర కూడా ఒక ప్రత్యేక మ్యూజిక్ షోను ఏర్పాటు చేసినట్లు, సందర్శకులను అది ఎంతగానో ఆకట్టుకుంటుందని ఎమ్మార్ సంస్థ తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com