రియాద్ సీజన్: నెలలోనే 4 మిలియన్లు దాటిన సందర్శకులు
- November 26, 2022
రియాద్: "బియాండ్ ఇమాజినేషన్" అనే థీమ్‌తో రియాద్ సీజన్లో సందర్శకుల సంఖ్య ఒక నెలలోనే నాలుగు మిలియన్లకు చేరుకుందని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (జిఇఎ) డైరెక్టర్ల బోర్డు చైర్మన్ తుర్కీ అల్-షేక్ ప్రకటించారు. అక్టోబర్ 21న రియాద్ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. సీజన్లో అతిపెద్ద జోన్ అయిన బౌలేవార్డ్ వరల్డ్‌ను ప్రారంభించిన తర్వాత సందర్శకుల భారీగా పెరిగిందన్నారు. ఈ సీజన్లో ఫెరారీ ఫెస్టివల్, ప్రపంచ కప్ కార్యకలాపాలతో పాటు అభిమానుల ఉత్సవం, లెబనీస్ మయాస్ బ్యాండ్ ప్రదర్శనలు, అనిమే టౌన్, బౌలేవార్డ్ ఈవ్, బ్లాక్ హ్యాట్ ఈవెంట్, అల్-సువైదీ పార్క్‌లోని ఫెస్టివల్ ఆఫ్ కల్చర్స్ వంటి అతిపెద్ద ఈవెంట్లు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయని వెల్లడించారు. రియాద్ సీజన్‌లోని 15 ఎంటర్టైన్మెంట్ జోన్లలో ఒకటైన బౌలేవార్డ్ రియాద్ సిటీ, 7 సౌదీ నాటకాలతో సహా 25 మిడిల్ ఈస్టర్న్, అంతర్జాతీయ నాటకాలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్
- ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా 20 గంటల బుజ్జాయిల కథా మహోత్సవం
- ఇరాన్‌తో శాంతి చర్చలకు వెళ్లము: ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్
- బీప్లస్ విత్ భాస్కర్ విశ్వ వేదిక పై 26.2 గంటల అఖండ కథా యజ్ఞం









