రియాద్‌లో కొత్త విమానాశ్రయ నిర్మాణం.. ప్రకటించిన క్రౌన్ ప్రిన్స్
- November 29, 2022
సౌదీ: రియాద్ లో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ప్రణాళికలను సోమవారం మధ్యాహ్నం క్రౌన్ ప్రిన్స్ ప్రకటించారు. కొత్త విమానాశ్రయం 2030 నాటికి 120 మిలియన్ల మంది ప్రయాణీకులను స్వాగతించేలా నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. 2050 నాటికి 3.5 మిలియన్ టన్నుల కార్గోను ప్రాసెస్ చేసేలా ప్రణాళికలు తయారు చేసినట్లు వెల్లడించారు. గ్లోబల్ లాజిస్టిక్స్, టూరిస్ట్, ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా రియాద్ స్థానాన్ని పెంచుతుందన్నారు. కొత్త ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా నిలుస్తుందని, ఆరు సమాంతర రన్‌వేలను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ విమానాశ్రయం సౌదీ చమురుయేతర GDPకి 27 బిలియన్ సౌదీ రియాల్స్‌ను జోడిస్తుందని క్రౌన్ ప్రిన్స్ వెల్లడించారు. రియాద్‌ను ప్రపంచంలోని టాప్ టెన్ సిటీ ఎకానమీలలో ఒకటిగా మార్చడం, "గ్లోబల్ గేట్‌వే"గా రియాద్ ను మార్చడం వంటి ప్రయాత్నాలు పెద్ద ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయని క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ తెలిపారు. రాబోయే ఎనిమిది సంవత్సరాలలో రియాద్ జనాభా పెరుగుదలను అంచనా వేసి సుమారు 15 నుండి 20 మిలియన్ల మంది ప్రయాణికులు సేవలు అందించేందుకు ఈ విమానాశ్రయం నిర్మాణ ప్రణాళికలు రూపొందించినట్లు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!