న్యూజిలాండ్ షూట్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్.!

- December 01, 2022 , by Maagulf
న్యూజిలాండ్ షూట్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్.!

శంకర్, రామ్ చరణ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ పాట షూట్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన శంకర్ అండ్ టీమ్, తాజాగా ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 
న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో రామ్ చరణ్, కియారా అద్వానీలపై బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాడు డైరెక్టర్ శంకర్. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయ్యిందనీ, చాలా బాగా వచ్చిందనీ సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఓ పోస్ట్ పెట్టాడు.
న్యూజిలాండ్ లొకేషన్లలో దిగిన కొన్ని ఫోటోలు సైతం ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయ్. ఈ సాంగ్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. 
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో 15 వ చిత్రంగా రూపొందుతోంది. చరణ్ డబుల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో అంజలి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ డైరెక్టర్ కమ్ నటుడు ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com