యూఏఈ జాతీయ దినోత్సవం: అట్టహాసంగా వేడుకలు

- December 03, 2022 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవం: అట్టహాసంగా వేడుకలు

యూఏఈ: అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (ADNEC)లో జరిగిన 51వ జాతీయ దినోత్సవ అధికారిక వేడుకలకు యూఏఈ  అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ సభ్యులు, ఎమిరేట్స్ పాలకులు, క్రౌన్ ప్రిన్సెస్, డిప్యూటీ పాలకులు, షేక్‌లు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌కు అభినందనలు తెలిపారు. దేశాన్ని మార్గంలో నడిపించడంలో తన విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది షేక్‌లు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు, దౌత్యవేత్తలు , అతిథులు పాల్గొన్నారు.

ఎమిరాటీ సంగీతకారులతో పాటు రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ప్రదర్శించిన యూఏఈ  జాతీయ గీతంతో అధికారిక వేడుకలు ప్రారంభమయ్యాయి.  దీని తరువాత దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్మారక విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో యూఏఈ వివిధ రంగాలలో సాధించిన విజయాలను వివరిస్తూ.. స్పెషల్ షో ప్రదర్శించారు. యూఏఈ భవిష్యత్తు కోసం దాని సాహసోపేతమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు, ప్రణాళికలను సవివరంగా వివరిస్తూ నిర్వహించిన కార్యక్రమాలు వేడకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com