యూఏఈలో భారీగా తగ్గిన కోవిడ్-19 కేసులు

- December 04, 2022 , by Maagulf
యూఏఈలో భారీగా తగ్గిన కోవిడ్-19 కేసులు

యూఏఈ: యూఏఈలో కొత్త కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ల సంఖ్య 12 నెలల తర్వాత రెండు అంకెల స్థాయికి చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా 101  కొవిడ్ కేసులు కొత్తగా నమోదు అయినట్లు యూఏఈ ఆరోగ్య , నివారణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చివరిసారిగా 100 కంటే తక్కువ ఇన్ఫెక్షన్లు గతేడాది 2021 డిసెంబర్ 13న 92 కేసులు నమోదయ్యాయి.

ఈ నెల ప్రారంభంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు, ముందుజాగ్రత్త చర్యలను రద్దు చేశారు. ఈ వారం అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) రాజధాని అల్ ఐన్, దుబాయ్, షార్జా, ఉమ్ అల్ క్వైన్, ఫుజైరా, రస్ అల్ ఖైమాలోని కోవిడ్-19 స్క్రీనింగ్ కేంద్రాలను మూసివేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com