హైదరాబాద్ లో భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు..
- December 06, 2022
హైదరాబాద్: భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు అయింది.జాబ్ లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న అమ్మాయిలను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారు. అమ్మాయిలకు, కస్టమర్లకు డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారం చేస్తున్నారు. సెక్స్ రాకెట్ ముఠాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ సెక్స్ రాకెట్ ముఠాతో పాటు 17 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. 15 సిటీల నుండి వారిని రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని తెలిపారు. వెబ్ సైట్, వాట్సప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు పేర్కొన్నారు. 39 కేసుల్లో నిందితులకు ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. 1419 మంది అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని వెల్లడించారు. సెక్స్ రాకెట్స్ తో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్లుకు ఎరా వేస్తున్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ లో ఐదు కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని చెప్పారు. సప్లైయర్స్, బ్రోకర్లు ద్వారా భాదితులను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని, విమానాల్లో కూడా అమ్మాయిలను వేరే రాష్ట్రాలకి కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని వెల్లడించారు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్ కత్తాకు చెందిన వారు భాదితులు ఉన్నారని తెలిపారు. బంగ్లాదేశ్, నేపాల్, యూజీకిస్తాన్, రష్యాకి చెందిన అమ్మాయిలతో కూడా ఈ దందా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వ్యభిచారం ద్వారా వచ్చిన అమౌంట్ లో 30 % అమ్మాయిలకు, 35 % యాడ్స్, వెబ్ సైట్ కి వెళ్తుందని మిగిలిని 35 % ఆర్గనైజర్లుకి చేరుతుందని పేర్కొన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడు 915 మంది అమ్మాయిలని ముంబై, కోల్ కత్తా నుండి సప్లై చేశాడని పేర్కొన్నారు.
2019 నుండి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సప్లై చేస్తున్నారని తెలిపారు. అనంతపూర్, కరీంనగర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ , రాచకొండ, హైదరాబాద్ లో ఆర్నావ్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్, వ్యభిచార దందా చేస్తున్నాడని వెల్లడించారు. ఆర్నావ్ 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని పేర్కొన్నారు. సోమజిగూడలోని ఓ ఫ్లాట్ లో ఆర్నావ్ ను పట్టుకున్నామని, అదే ఇంట్లో MDMA డ్రగ్స్ ను సీజ్ చేశామని తెలిపారు.
ఈ సెక్స్ రాకెట్ వివిధ గ్రూప్ లుగా విడిపోయి ఈ దందా చేస్తున్నారని తెలిపారు. కొన్ని హోటల్స్ కి పని చేసే వాళ్ళ ప్రమేయం కూడా ఉందని వారిని కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. వెబ్ సైట్ లో బుక్ చేసుకున్నవారికి అమ్మాయిలని సప్లై చేస్తున్నారని పేర్కొన్నారు. జాబ్ లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న అమ్మాయిలను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామని చెప్పారు.
MDMA డ్రగ్స్ ను అమ్మాయిలకు, కస్టమర్లకు ఇచ్చి వ్యభిచారం చేస్తున్నారని పేర్కొన్నారు. చాలా మంది అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారని, లగ్జరీ లైఫ్ చూపించి మరి కొంతమంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతున్నారని పేర్కొన్నారు. ఒక్కొక్కరు 40 లక్షలు సంపాదించినట్లు తెలిసిందన్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది









