గ్రాండ్ మస్జీదులో వాలంటీర్ల సేవలు: 30 మిలియన్ల మంది భక్తులకు ప్రయోజనం

- December 08, 2022 , by Maagulf
గ్రాండ్ మస్జీదులో వాలంటీర్ల సేవలు: 30 మిలియన్ల మంది భక్తులకు ప్రయోజనం

రియాద్: మక్కాలోని గ్రాండ్ మస్జీదులో అందించిన స్వచ్ఛంద సేవల ద్వారా సుమారు 30 మిలియన్ల మంది ఆరాధకులు ప్రయోజనం పొందారని సౌదీ అరేబియా ప్రకటించింది. సౌదీ అరేబియా సామాజిక, స్వచ్ఛంద సేవ, మానవతా విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 17 రంగాలలోని 35 సంస్థల నుండి వాలంటీర్లు గత సంవత్సరం ఆగస్టు నుండి ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు సుమారు 30 మిలియన్ల మంది భక్తులకు సేవ చేయడంలో మొత్తం 1.2 మిలియన్ గంటలపాటు శ్రమించారు. స్వచ్ఛంద సేవల్లో 5.9 మిలియన్ల ఆరాధకులకు అల్పాహారం అందించడం, 366,500 గొడుగులు అందించడం,  2.3 మిలియన్ జంజామ్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com