పనిమనుషులను నియమిస్తానని మోసం.. మహిళ అరెస్ట్
- December 08, 2022
దుబాయ్: పని మనుషులను ఏర్పాటు చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడిన 43 ఏళ్ల ఆసియా మహిళపై దుబాయ్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. Dh 6,000 - Dh10,000 మధ్య కమీషన్ తీసుకొని పనిమనుషులను ఏర్పాటు చేస్తానని సదరు మహిళ ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన చూసిన ఓ వ్యక్తి పనిమనిషిని ఏర్పాటు చేయాలని సంప్రదించగా.. 6,000 దిర్హామ్ లను మహిళ తీసుకుంది. డబ్బు ఇచ్చిన రెండు రోజుల తరువాత ఆమె తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులోకి రాలేదు. దీంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. గతంలోనూ ఇతరులను ఇలాగే మోసం చేసిందని తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







