డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల
- December 09, 2022
తిరుమల: వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను ఈ నెల 12న మధ్యాహ్నం 03:00 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
అలాగే 2023 జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టిక్కెట్లకు ఆన్‌లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ ఈ నెల 12న ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ 14న ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారిలోంచి లక్కీడీప్ ద్వారా విజేతలను ఎంపిక చేసి టిక్కెట్లు కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి, ఆర్జిత సేవలను బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







